శ్రీవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి | HIGH COURT JUDGE VISITS TEMPLES | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

Nov 27 2016 2:02 AM | Updated on Sep 4 2017 9:12 PM

శ్రీవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

ద్వారకాతిరుమల/జంగారెడ్డి గూడెం / జంగారెడ్డిగూడెం రూరల్‌ : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామ లింగేశ్వరరావు, రమ్య దంపతులు, వారి కుమార్తె రచన సందర్శించారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ద్వారకాతిరుమల/జంగారెడ్డి గూడెం / జంగారెడ్డిగూడెం రూరల్‌ : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామ లింగేశ్వరరావు, రమ్య దంపతులు, వారి కుమార్తె రచన సందర్శించారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. న్యాయమూర్తి శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామి వారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆలయ సూపరింటెండెంట్‌ రమణరాజు ఆయనకు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు.  
 
‘మద్ది’లో పూజలు 
గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారినీ రామలింగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మ¯ŒS జడ్జిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఏలూరు ఎక్సైజ్‌ మేజిసే్ట్రట్‌ తిరుమలరావు, జంగారెడ్డిగూడెం జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.అజయ్‌కుమార్‌ ఆయన వెంట ఉన్నారు. 
తిరుమల పారిజాతగిరిలో.. : కాగా జంగారెడ్డి గూడెంలోని గోకుల పారి జాతగిరి వేంకటేశ్వరస్వామి వారినీ రామ లింగేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా కార్తీక మాసం సందర్భంగా తొలుత అర్చకులు వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి ప్రారంభించి అనేక కార్యక్రమాలు జరిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement