బీచ్‌లో హీరో సూర్య కలకలం
హీరో సూర్య నటిస్తున్న సింగం-3 సినిమా షూటింగ్‌లో భాగం. నిజానికి సినిమా షూటింగ్ అంటే పెద్ద పెద్ద కెమెరాలు, రెండు మూడు మేకప్ బస్సులు ఉంటాయి.
- పోలీసుల హడావుడితోసందర్శకుల్లో కలవరం
 - సినిమా షూటింగ్ సందడి అని తెలిసి ఆనందం
 
	బీచ్‌రోడ్ : రయ్‌న దూసుకొచ్చిన కార్లు... బిలబిలామంటూ దిగిన పోలీసులు. ఈ హడావుడికి విశాఖ బీచ్ రోడ్డులో జనం హడలిపోయారు.  కాసేపు పోలీసుల హడావుడి చూసిన వారు...చివరకు అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ హడావుడి అంతా హీరో సూర్య నటిస్తున్న సింగం-3 సినిమా  షూటింగ్‌లో భాగం. నిజానికి సినిమా షూటింగ్ అంటే పెద్ద పెద్ద కెమెరాలు, రెండు మూడు మేకప్ బస్సులు ఉంటాయి.
	
	కానీ ఈ షుటింగ్ మాత్రం అలాంటి హడావుడి లేకుండా అత్యాధునిక కెమెరాలను ఉపయోగించడం వల్ల ఇది సినిమా షూటింగ్ అనే విషయం తెలుసుకోవటానికే కొంత సమయం పట్టింది. షూటింగ్‌లో భాగంగా సూర్య  ఎరుపు రంగు కారులో వచ్చి ఓ రౌడీని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టి తరువాత కారులో వెళ్లిపోవాలి. ఇదీ సీన్. కానీ సూర్య తిరిగి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు కారు స్టార్ట్ కాలేదు. దీంతో మరల తెలుపు రంగు కారుతో సీన్‌ను రీషూట్ చేశారు. బీచ్‌లో సందర్శకులు ఈ షూటింగ్‌ను ఆసక్తిగా తిలకించారు.
	
	

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
