భక్తులతో తిరుమల కిటకిట | heavy rush at tirumala | Sakshi
Sakshi News home page

భక్తులతో తిరుమల కిటకిట

Dec 4 2016 7:58 AM | Updated on Sep 4 2017 9:54 PM

భక్తులతో తిరుమల కిటకిట

భక్తులతో తిరుమల కిటకిట

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల కూడా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

శనివారం శ్రీవేంకటేశ్వరస్వామిని 78,559 మంది భక్తులు దర్శించుకోగా 42,465 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement