జోగిపేటలో భారీ వర్షం | heavy rain in jogipeta | Sakshi
Sakshi News home page

జోగిపేటలో భారీ వర్షం

Sep 13 2016 6:07 PM | Updated on Apr 4 2019 5:45 PM

జోగిపేటలో కురుస్తున్న భారీ వర్షం - Sakshi

జోగిపేటలో కురుస్తున్న భారీ వర్షం

అందోలు మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది.

జోగిపేట: అందోలు మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. ఉదయం 4 గంటల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురియడంతో మండల పరిధిలోని వివిధ చెరువులు, కుంటల్లోకి నీరు కొద్దిపాటిగా చేరినట్లు ప్రజలు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు వర్షం కురియడంతో జనజీవనం స్థంభించి పోయింది. బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. 

వర్షం కారణంగా మసీదుల్లోనే ప్రార్థనలు చేశారు. జోగిపేటలోని ప్రధాన రహదారులపై అక్కడక్కడ గుంతల్లో నీరు చేరింది. కొన్ని రోడ్లు వర్షంతో చిత్తడిగా మారాయి. జనాలు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 40 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement