ముద్రగడ షుగర్ లెవల్స్ డౌన్! | health checkup mudragada couple | Sakshi
Sakshi News home page

ముద్రగడ షుగర్ లెవల్స్ డౌన్!

Feb 5 2016 1:31 PM | Updated on Jul 30 2018 6:21 PM

ముద్రగడ షుగర్ లెవల్స్ డౌన్! - Sakshi

ముద్రగడ షుగర్ లెవల్స్ డౌన్!

ఆమరణ దీక్ష చేపట్టిన ముద్రగడ దంపతులకు డాక్టర్లు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.

కిర్లంపూడి: ఆమరణ దీక్ష చేపట్టిన ముద్రగడ దంపతులకు డాక్టర్లు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడ పద్మనాభానికి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు, అధికారులు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ నేత చేపట్టిన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేతలు, ప్రజల నుంచి విశేషమైన మద్ధతు లభిస్తోంది. గరిటెలతో ఖాళీ కంచాలు మోగిస్తూ శబ్ధం చేస్తూ ముద్రగడ దంపతులు, కుటుంబసభ్యులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు 13 జిల్లాల నుంచి మంచి స్పందన వస్తోంది.

కృష్ణా జిల్లాలో ముద్రగడ దీక్షకు మద్దతుగా కలిదిండిలో వివేకానంద ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైకలూరు ఇంఛార్జ్ డీఎన్ఆర్ ముద్రగడ ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేబీరోడ్డులో వంగవీటి రంగా విగ్రహం వద్ద ఖాళీ కంచాలతో మద్దతుదారులు నిరసన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement