పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్‌ప్రెస్ | guwahati express 2 coaches side tracked and no damage appears | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్‌ప్రెస్

Nov 17 2015 8:55 AM | Updated on Apr 7 2019 3:28 PM

వైఎస్సార్ జిల్లా నందలూరు సమీపంలో మంటపంపల్లి వద్ద మంగళవారం ఉదయం గౌహతి-చెన్నై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

ఎర్రగుంట్ల : వైఎస్సార్ జిల్లా నందలూరు సమీపంలో మంటపంపల్లి వద్ద మంగళవారం ఉదయం గౌహతి-చెన్నై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఎక్స్ప్రెస్ రెండు బోగీలు పట్టాలు తప్పాయి, ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఆ బోగీలలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రైలు మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎర్రగుంట్లలో హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ను, కమలాపురంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను, భాకరాపేటలో చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement