హీరో గోపీచంద్ దంపతులు గురువారం కాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహించారు. భార్య రేష్మి,కుమారుడితో కలిసి ఆయన పూజలు చేశారు.
శ్రీకాళహస్తి: హీరో గోపీచంద్ దంపతులు గురువారం కాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహించారు. భార్య రేష్మి, కుమారుడితో కలిసి ఆయన పూజలు చేశారు. కాగా ఈ రోజు ఉదయం గోపీచంద్ దంపతులు వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తన కుమారుడి పుట్టువెంట్రుకలు స్వామివారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నట్టు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.