పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు | Goods train derailment | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Jan 7 2017 4:14 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఆసి ఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని వీర్గాం–మాణిక్‌గఢ్‌ రైల్వేస్టేషన్ల

వీర్గాం సమీపంలో ఘటన
రైళ్ల రాకపోకలకు అంతరాయం


కాగజ్‌నగర్‌/రామగుండం/కాజీపేట: ఆసి ఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని వీర్గాం–మాణిక్‌గఢ్‌ రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం రాత్రి 1.20 గంటలకు ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడ్‌తో కాగజ్‌నగర్‌ నుండి బల్లార్షా రూట్‌లో వెళ్తున్న ఈ రైలుకు సంబంధించిన 16 బోగీలు పట్టాలు తప్పడంతో న్యూ ఢిల్లీ–చెన్నై ప్రధాన రైల్వేలైన్‌లో ఉన్న కాగజ్‌నగర్‌–బల్లర్షా రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు బోగీలను తొలగించేందుకు సహా యక చర్యలను ముమ్మరం చేశారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడి నుండి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు రాకపో వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని భావిసు ్తన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో హైదరా బాద్‌–న్యూఢిల్లీ (తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌)ను రద్దు చేశారు.  శనివారం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ సైతం రద్దు చేశారు. సికింద్రాబాద్‌–బల్లార్షా (భాగ్యనగర్‌) ఎక్స్‌ప్రెస్‌ రైలు అప్‌–డౌన్‌ రెండు వైపుల రద్దు చేశారు. యశ్వంత పూర్‌–గోరఖ్‌పూర్, సికింద్రాబాద్‌– గోరఖ్‌ పూర్, బెంగళూరు–హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వయా నిజామాబాద్, ముధ్కేడ్, ఆదిలాబాద్, పింపల్‌కుట్టి మీదుగా దారి మళ్లించారు. సికింద్రాబాద్‌–దాణాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును వయా విజయవాడ, వాడీ, షోలాపూర్‌ మీదుగా దారి మళ్లించారు. 

త్రివేండ్రం– న్యూఢిల్లీ (కేరళ) ఎక్స్‌ప్రెస్‌ రైలు ను వయా అరక్కోణం, రేణిగుంట, గుంత కల్, వాడీ, షోలాపూర్‌ మీదుగా మళ్లించారు. చెన్నై సెంట్రల్‌ – హజ్రత్‌ నిజాముద్దీన్‌ (తమిళనాడు), త్రివేండ్రం సెంట్రల్‌–కోర్భా (కోర్భా) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వయా విజయ వాడ, దువ్వాడ మీదుగా మళ్లించారు. మదురై–దుర్గాపుర (జైపూర్‌)ఎక్స్‌ప్రెస్, వైజాగ్‌–న్యూఢిల్లీ (ఏపీ ఏసీ ఎక్స్‌ ప్రెస్‌), వైజాగ్‌–హజ్రత్‌ నిజాముద్దీన్‌ (దక్షిణ్‌) ఎక్స్‌ ప్రెస్‌ రైళ్ళను ఈస్ట్‌కోస్ట్‌ రూట్‌ మీదుగా మళ్లిం చారు.  0870–2576226, రైల్వే ఫోన్‌ నంబర్‌ 82660లలో ప్రయాణికులు రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement