కురుబ వధూవరుల వేదికకు విశేష స్పందన | good response to kuruba vivaha parichaya vedika | Sakshi
Sakshi News home page

కురుబ వధూవరుల వేదికకు విశేష స్పందన

Oct 8 2016 10:06 PM | Updated on Sep 4 2017 4:40 PM

జిల్లా కురుబ సంఘం ఆధ్వర్యంలో శనివారం గుత్తిరోడ్డులోని కనకదాస కళ్యాణమంటపంలో నిర్వహించిన కురుబ వధూవరుల పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది.

అనంతపురం రూరల్‌ : జిల్లా కురుబ సంఘం ఆధ్వర్యంలో శనివారం గుత్తిరోడ్డులోని కనకదాస కళ్యాణమంటపంలో నిర్వహించిన కురుబ వధూవరుల పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది. అనంతపురం, కర్నూల్, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వధూవరుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో వివాహ శుభకార్యాలకు  వధూవరుల పరిచయ వేదికలు దోహదపడతాయన్నారు. కురుబ సంఘం నాయకులు పిడుగు క్రిష్ణమూర్తి, కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు పుల్లన్నగౌడు, లక్ష్మిసంజప్ప,  నారాయణ, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement