స్వర్ణకారుల ఒకరోజు దీక్ష | goldsmiths one day strike | Sakshi
Sakshi News home page

స్వర్ణకారుల ఒకరోజు దీక్ష

Sep 27 2016 11:54 PM | Updated on Sep 4 2017 3:14 PM

స్వర్ణకారుల ఒకరోజు దీక్ష

స్వర్ణకారుల ఒకరోజు దీక్ష

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నకిరేకల్‌లోని మెయిన్‌ సెంటర్‌లో స్వర్ణకారులు మంగళవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు

నకిరేకల్ః  
 తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నకిరేకల్‌లోని మెయిన్‌ సెంటర్‌లో స్వర్ణకారులు మంగళవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల స్వర్ణకారులు పాల్గొన్నారు. స్వర్ణకారులకు ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వృత్తి నైపుణ్యం కోసం రూ.5లక్షల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు చింతోజు నవీన్‌కుమార్, పానగంటి ఉపేంద్రచారి, ఓంకార చారి, గందసిరి రామకృష్ణ, నరేంద్రచారి ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement