42 తులాల బంగారం అపహరణ | gold robbery | Sakshi
Sakshi News home page

42 తులాల బంగారం అపహరణ

Oct 3 2016 9:54 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఇంటిలో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలను బద్దలు కొట్టి కొల్లగొట్టారు. భాదితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కేఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన బిక్కిన వెంకటేశ్వరరావు తన తల్లికి ఆపరేషన్‌ చేయించేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. ఇంటిలో భార్య శిరీష మాత్రమే ఉన్నారు. కాగా ఆదివారం సాయంత్రం శిరీష ఇంటికి తాళం వేసి హౌసింగ్‌ బోర్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి Ðð ళ్లారు. ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇం

రామచంద్రపురం:
ఇంటిలో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలను బద్దలు కొట్టి కొల్లగొట్టారు. భాదితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కేఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన బిక్కిన వెంకటేశ్వరరావు తన తల్లికి ఆపరేషన్‌ చేయించేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. ఇంటిలో భార్య శిరీష మాత్రమే ఉన్నారు. కాగా ఆదివారం సాయంత్రం శిరీష ఇంటికి తాళం వేసి హౌసింగ్‌ బోర్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి Ðð ళ్లారు. ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు, ఇంటిలోని బీరువా తలుపులు బద్దలుకొట్టి ఉన్నాయి. బీరువాలో గల 42 తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 20 వేల నగదును దొంగలు అపహరించుకు పోయారు. ఈ సమాచారాన్ని సోమవారం పోలీసులకు అందించటంతో రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కె. శ్రీధర్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్‌ టీం సభ్యులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మొత్తం విలువ రూ 4.45లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement