వ్యాపారి ఇంట్లో భారీ చోరీ | gold and money stolen at businessman home in kurnool town | Sakshi
Sakshi News home page

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

Oct 23 2016 1:45 PM | Updated on Aug 30 2018 5:27 PM

కర్నూలు జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది.

కర్నూలు: జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌లో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు పడి ఉన్న బంగారం, నగదు దోచుకెళ్లారు. ఆ వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యాపారి ఇంట్లో శనివారం రాత్రి దొంగలుపడి 100 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.10 లక్షల నగదును చోరీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement