హోర్డింగ్స్‌పై సమాధానమివ్వండి.. | Give explanation about hordings | Sakshi
Sakshi News home page

హోర్డింగ్స్‌పై సమాధానమివ్వండి..

Oct 15 2016 9:48 PM | Updated on Apr 3 2019 7:53 PM

హోర్డింగ్స్‌పై సమాధానమివ్వండి.. - Sakshi

హోర్డింగ్స్‌పై సమాధానమివ్వండి..

నగరంలోని ప్రధాన కూడళ్లలో అనధికారికంగా కొనసాగుతున్న గ్రౌండ్‌సైడ్‌ హోర్డింగ్‌లతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ..

గుంటూరు లీగల్‌: నగరంలోని ప్రధాన కూడళ్లలో అనధికారికంగా కొనసాగుతున్న గ్రౌండ్‌సైడ్‌ హోర్డింగ్‌లతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎదుట మన లక్ష్యం పోస్టర్‌ ఫ్రీ అనే స్వచ్ఛంద సేవాసంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ నెల 25న  నగరపాలక సంస్థ  సమాధానం దాఖలు చేయాలని  జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి శనివారం ఆదేశాలు జారీచేశారు. నగరంలో అనధికారికంగా గ్రౌండ్‌సైడ్‌ హోర్డింగ్స్‌ కొనసాగుతున్నాయని చెప్పారు. 
 
ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన హోర్డింగ్స్‌ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదుచేసినా  పట్టించుకోవడంలేదని  ఆరోపిస్తూ మన లక్ష్యం పోస్టర్‌ ఫ్రీ అనే సంస్థ గతంలో దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషనర్, పట్టణ ప్రణాళికాధికారులు అక్టోబర్‌ 15న హాజరై తమ సమాధానం దాఖలు చేయాని ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం జిల్లా న్యాౖయసేవాధికార సంస్థ  ఎదుట పట్టణ ప్రణాళికాధికారి రమేష్‌బాబు హాజరయ్యారు. కొంత సమయం ఇస్తే తమ సమాధానం దాఖలు చేస్తామని న్యాయమూర్తికి విన్నవించారు. న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి స్పందిస్తూ గ్రౌడ్‌సైడ్‌ హోర్డింగ్స్‌ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉదని నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 25వ తేదీన సమాదానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement