ఎంహెచ్‌ఓగా గంగిరెడ్డి...? | gangireddy elect to mho | Sakshi
Sakshi News home page

ఎంహెచ్‌ఓగా గంగిరెడ్డి...?

Aug 18 2016 12:00 AM | Updated on Jun 1 2018 8:39 PM

నగరపాలక సంస్థ ప్రజావైద్యాధికారి (మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌–ఎంహెచ్‌ఓ)గా గంగిరెడ్డి నియమితులయ్యే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి.

అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ ప్రజావైద్యాధికారి (మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌–ఎంహెచ్‌ఓ)గా గంగిరెడ్డి నియమితులయ్యే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డాక్టర్‌ గంగాధరరెడ్డి సొంతశాఖ అయిన వైద్య ఆరోగ్యశాఖకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రిలీవ్‌ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న గంగిరెడ్డికి ఎంహెచ్‌ఓ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement