బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్టు | gamblers arrest in hindupur | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్టు

Apr 14 2017 11:50 PM | Updated on Sep 5 2017 8:46 AM

పట్టణంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్, జూదాలు ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,01,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్‌ సీఐ ఈదూర్‌బాషా శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

హిందూపురం రూరల్‌ : పట్టణంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్, జూదాలు ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,01,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్‌ సీఐ ఈదూర్‌బాషా శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు ఆదేశాలతో వన్‌టౌన్‌ ఎస్‌ఐ దిలీప్‌కుమార్, సిబ్బంది సునీల్‌నాయక్, ఆదినారాయణ, చెన్నకేశవులు, వెంకటరామిరెడ్డి, రామాంజి బెట్టింగ్‌ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో వారిపై నిఘా ఉంచి దాడులు చేశామన్నారు.

దాడుల్లో ఐదుగురు క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న అంజనప్రసాద్, నారాయణ, ఉదయ్‌కుమార్, ఇర్ఫాన్, సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.71,300 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీలో పేకాట స్థావరాలపై దాడులు చేసి బాబాజాన్, నౌషాద్, బాబు, నాగరాజును అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.30,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను రిమాండ్‌కి తరలించి శనివారం కోర్టుకు హాజరుపరుస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement