జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తి : జేసీ | fourty percent pulse survey | Sakshi
Sakshi News home page

జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తి : జేసీ

Aug 18 2016 12:54 AM | Updated on Sep 4 2017 9:41 AM

జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తి : జేసీ

జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తి : జేసీ

న స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,800 మంది సిబ్బంది స్మార్ట్‌ పల్స్‌ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. 17 లక్షల కుటుంబాలకు గాను, ఇప్పటి వరకూ 6 లక్షల 13 వేల కుటుంబాల సర్వే పూర్తి చేశారని తెలిపారు. నెల రోజుల్లోగా ఈ సర్వే పూర్తి చేస్తామన్నారు. సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఎంపీడీఓ కె.కిషోర్‌కుమార్, డిప్యూ

రంగంపేట : జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తయిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో జిల్లాలోని అన్ని మండల అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,800 మంది సిబ్బంది స్మార్ట్‌ పల్స్‌ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. 17 లక్షల కుటుంబాలకు గాను, ఇప్పటి వరకూ 6 లక్షల 13 వేల కుటుంబాల సర్వే పూర్తి చేశారని తెలిపారు. నెల రోజుల్లోగా ఈ సర్వే పూర్తి చేస్తామన్నారు. సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఎంపీడీఓ కె.కిషోర్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.సూర్య ప్రభ తదితరులు పాల్గొన్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement