నాలుగు నెమళ్లు మృత్యువాత | four peacocks died | Sakshi
Sakshi News home page

నాలుగు నెమళ్లు మృత్యువాత

Aug 6 2016 8:34 PM | Updated on Sep 4 2017 8:09 AM

పంట పొలాల్లో పిచికారి చేసిన రసాయనిక మందుల నీరు తాగి నాలుగు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. అంతర్‌గాం శివారులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కల్హేర్‌: పంట పొలాల్లో పిచికారి చేసిన రసాయనిక మందుల నీరు తాగి నాలుగు నెమళ్లు మృత్యువాత పడ్డాయి.   అంతర్‌గాం శివారులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకట్‌రాంరెడ్డి వ్యవసాయ పొలం వద్ద నాలుగు నెమళ్లు మృతి చెంది ఉన్నాయి. మరో నాలుగు అస్వస్థతకు గురయ్యాయి. గోపాలమిత్ర శ్రీనివాస్‌ అస్వస్థతకు గురైన వాటికి ప్రాథమిక చికిత్స చేశారు. పొలాల్లోని రసాయనిక మందుల నీరు తాగడం వల్లే మృతి చెంది ఉంటాయని తెలిపారు. అటవీ శాఖ అధికారులకు అస్వస్థతకు గురైన నెమళ్లను అప్పగించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement