గుప్తనిధుల కేసులో నలుగురు అరెస్ట్‌ | four arrest of funds case | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కేసులో నలుగురు అరెస్ట్‌

Feb 10 2017 9:56 PM | Updated on Sep 5 2017 3:23 AM

రాయదుర్గం సమీపంలోని బీటీపీరోడ్డు పక్కన పొలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ మహానంది శుక్రవారం సాయంత్రం తెలిపారు.

రాయదుర్గం అర్బన్‌ : రాయదుర్గం సమీపంలోని బీటీపీరోడ్డు పక్కన పొలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ మహానంది శుక్రవారం సాయంత్రం తెలిపారు. గురువారం మధ్యాహ్నం నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారించగా మొత్తం ఏడుగురికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు.

వీరిలో రాయదుర్గానికి చెందిన రమేష్‌నాయక్, బోయ రామదాస్, చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పూజారి చంద్ర, చంద్రగిరికి చెందిన వెంకటేశులును శుక్రవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల్లో పట్టణానికి చెందిన ఎలక్ట్రానిక్‌ చానల్‌ విలేకరి మున్నా, అతని బంధువు జాఫర్, జావేద్‌ ఉన్నట్లు చెప్పారు. వీరిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement