
విద్యార్థులకు షూ పంపిణీ చేసిన కెనడా దేశస్తురాలు
మండల కేంద్రంలోని రాళ్లగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆగాఖాన్ అకాడమీలో పనిచేస్తున్న కెనడా దేశస్తురాలు
శంషాబాద్: మండల కేంద్రంలోని రాళ్లగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆగాఖాన్ అకాడమీలో పనిచేస్తున్న కెనడా దేశస్తురాలు వెండి ఇలియాట్ షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి డీ రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూతనందించడానికి విదేశీయురాలు మందుకు రావడం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సాయం చేస్తామని ఈ సందర్భంగా ఆగాఖాన్ అకాడమీ అంతర్జాతీయ ప్రోగ్రామింగ్ డెరైక్టర్ ఫరాన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శ్రీకాంత్ యాదవ్, వార్డు సభ్యురాలు భారతమ్మ, ప్రధానోపాధ్యాయులు ఇమ్మానుయేల్, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.