రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక | Football competitions in the state selected for district teams | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

Sep 27 2016 12:39 AM | Updated on Oct 2 2018 8:39 PM

వచ్చే నెలలో మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్లను స్థానిక బిషప్‌గ్రౌండ్‌లో సోమవారం ఎంపిక చేశారు. ఫుట్‌బాల్‌ అసోసియేషన ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికకు జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు భారీగా తరలివచ్చారు.

డోర్నకల్‌ : వచ్చే నెలలో మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్లను స్థానిక బిషప్‌గ్రౌండ్‌లో  సోమవారం ఎంపిక చేశారు. ఫుట్‌బాల్‌ అసోసియేషఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికకు జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. వచ్చే నెల 5 నుంచి 7 వరకు మెదక్‌లో జరిగే బాలుర సబ్‌ జూని యర్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్, 20 నుంచి 22 వరకు అదిలాబాద్‌లోజరిగే జూనియర్‌ బాలి కల రాష్ట్రస్థాయి టోర్నమెంట్, అదే నెల చివరి వారంలో డోర్నకల్‌లో జరిగే సీనియర్‌ ఇంటర్‌ డిస్టిక్ట్ర్‌ బాలుర టోర్నమెంట్‌ పోటీలకు జట్ల ఎంపికకోసం పోటీలునిర్వహించారు. మూడు జట్లలో ఒక్కో దానికి 20 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేష¯ŒS సెక్రెటరీ సురేష్‌కుమార్‌ పాట్ని తెలిపారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ప్రేంకుమార్,  కృష్ణారావు, రవికుమార్, మోజేస్‌మనోహర్, స్వామీనాథ్, రాజేందర్‌  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement