‘అనంతే’ బాలికల ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత | foot ball tourny winner anantha | Sakshi
Sakshi News home page

‘అనంతే’ బాలికల ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత

Oct 1 2016 11:28 PM | Updated on Oct 2 2018 8:39 PM

‘అనంతే’ బాలికల ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత - Sakshi

‘అనంతే’ బాలికల ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత

అనంత’ జట్టే అండర్‌–17 బాలికల ఫుట్‌బాల్‌ విజేతగా నిలిచిందని స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ, పీడీ విజయ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ‘అనంత’ జట్టే అండర్‌–17 బాలికల ఫుట్‌బాల్‌ విజేతగా నిలిచిందని స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ, పీడీ విజయ తెలిపారు. సెప్టెంబర్‌ 28–30 వరకు తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో లీగ్‌ దశ నుంచి ప్రత్యర్థి జట్లను గోల్స్‌ ఏమీ చేయనీయకుండా మన బాలికలు సత్తా చాటారన్నారు.

ఫైనల్‌ మ్యాచ్‌లో 2–0 తో కర్నూలు జట్టును ఓడించడం ద్వారా విజయాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు. వీరు జాతీయస్థాయిలో రాణించి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. విజేతలను డీవీఈఓ సుభాకర్, పీడీ మనోహర్‌ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement