కృష్ణా ముంపులో మత్స్యకారుల ఇళ్లు | fisher man houses Drowned in krishna water | Sakshi
Sakshi News home page

కృష్ణా ముంపులో మత్స్యకారుల ఇళ్లు

Sep 24 2016 12:06 AM | Updated on Sep 4 2017 2:40 PM

కృష్ణా ముంపులో మత్స్యకారుల ఇళ్లు

కృష్ణా ముంపులో మత్స్యకారుల ఇళ్లు

మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదీ ముంపులో బాలాజీ ఘాట్‌కు ఆనుకొని ఉన్న సుమారు 8 మత్స్యకారుల ఇళ్లు శుక్రవారం నీట మునిగిపోయాయి.

మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదీ ముంపులో బాలాజీ ఘాట్‌కు ఆనుకొని ఉన్న సుమారు 8 మత్స్యకారుల ఇళ్లు శుక్రవారం నీట మునిగిపోయాయి. పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద సుమారు 30 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో బ్యాక్‌ వాటర్‌ మట్టపల్లి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో నది ఒడ్డున ఉన్న మత్స్యకారుల ఇళ్లు ముంపునకుగురయ్యాయి. అయితే వరద ముంపును ముందస్తుగా అంచనా వేసిన తహసీల్దార్‌ యాదగిరి, ఎస్‌ఐ ఆకుల రమేష్‌లు మత్స్యకారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని మత్స్యకారులు రామస్వామి, కోదండంలు కోరారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement