గార్మెంట్స్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం | fire accident in garments industry | Sakshi
Sakshi News home page

గార్మెంట్స్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Jan 12 2017 12:19 AM | Updated on Sep 5 2018 9:47 PM

పట్టణంలోని గన్నెవారిపల్లికాలనీలో గల శ్రీ కాశీవిశ్వనాథ్‌ రెడిమేడ్‌ గార్మెంట్స్‌ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున అగ్రిపమాదం సంభవించింది.

తాడిపత్రి రూరల్‌ : పట్టణంలోని గన్నెవారిపల్లికాలనీలో గల శ్రీ కాశీవిశ్వనాథ్‌ రెడిమేడ్‌ గార్మెంట్స్‌ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున అగ్రిపమాదం సంభవించింది. 70 కుట్టుమిషన్లతోపాటు  దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. పరిశ్రమలో నుంచి మంటలు రావడంతో స్థానికులు గమనించి రూరల్‌ పోలీసులకు తెలిపారు. పోలీసులు గార్మెంట్స్‌ యజమానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన పరిశ్రమ వద్దకు వచ్చారు.

అప్పటికే మంటలు చెలరేగుతుండటంతో అగ్నిమాపక సిబ్బందిని రప్పించి అదుపు చేయించారు. దాదాపు రూ.80 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు పెద్దన్న ఆవేదన వ్యక్తం చేశాడు. షార్ట్‌ సర్క్యూట్‌ తోనే ప్రమాదం జరిగిందని బాధితుడు వాపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement