అగ్ని ప్రమాదంలో 14 ఇళ్లు దగ్ధం | fire accident, fourteen houses burnt | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో 14 ఇళ్లు దగ్ధం

Jan 7 2016 8:34 AM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంతో 14 తాటాకు ఇళ్లు కాలిపోయాయి.

గార: ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో 14 తాటాకు ఇళ్లు కాలిపోయాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం పంచాయతి పరిధిలోని డొక్లపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. అర్ధరాత్రి మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేసరికి 14 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఆస్తినష్టం ఎంత జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement