గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం | fire accident at gas filling centre in madanapally | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

Feb 8 2017 8:14 PM | Updated on Sep 5 2018 9:47 PM

గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం - Sakshi

గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

మదనపల్లిలోని తారకరామ సినిమా థియేటర్‌ ఎదురుగా ఉన్న బషీర్‌ గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

మదనపల్లి(చిత్తూరు జిల్లా):
మదనపల్లిలోని తారకరామ సినిమా థియేటర్‌ ఎదురుగా ఉన్న బషీర్‌ గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదు లీటర్ల గ్యాస్‌ సిలిండర్‌లోకి అక్రమంగా పెద్ద సిలిండర్‌ నుంచి గ్యాస్‌ నింపుతుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

ఈ మంటలకు రెండు పెద్ద సిలిండర్‌లు పేలాయి. దీంతో పరిసర ప్రాంతంలో ఉన్న ఇతర షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement