ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం | Fire accident at fertilizer shop | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం

Feb 18 2017 8:25 AM | Updated on Oct 1 2018 6:38 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. తిరుమల ఎరువుల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి రెండు ఫైరింజిన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement