కేంద్రమంత్రికి సన్మానం | Felicitation to Honorable Minister | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రికి సన్మానం

Apr 23 2017 11:25 PM | Updated on Sep 5 2017 9:31 AM

కేంద్రమంత్రికి సన్మానం

కేంద్రమంత్రికి సన్మానం

ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ విశ్రాంతి కార్మికులకు కనీసం రూ.5 వేల హయ్యర్‌ పింఛన్‌ సౌకర్యాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాకు చెందిన ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు కేంద్రమంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు బస్వరాజ్, రాజసింహుడు, నర్సింహులు, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement