కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

father suicide with daughter marriage loan - Sakshi

ఆదిలాబాద్‌, గుడిహత్నూర్‌(బోథ్‌): కన్న కూతురి పెళ్లి నిశ్చయమైంది. ఎలాగోలా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుదామనుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లి ఖర్చులకు ఎక్కడా అప్పు దొరక్కపోవడంతో తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుడిహత్నూర్‌ మండలం తోషం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఏఎస్సై అశోక్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పి.వెంకటరమణ(43) తాపీమేస్త్రీగా పని చేస్తూ భార్య లక్ష్మీ, కుమారుడు అనిల్, కూతురును పోషి స్తున్నాడు.

కూతురు పెళ్లి ఆదిలాబాద్‌కు చెందిన యువకుడితో నిశ్చయమైంది. ఈ నెల 24న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లు చేస్తూనే.. బంధువులకు పెళ్లి పత్రికలు సైతం పంపించారు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తెలిసిన వారి వద్ద అప్పు కోసం ప్రయత్నించాడు. ఎక్కడా అప్పు లభించకపోవడంతో మనస్తాపం చెందా డు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటరమణ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు పెళ్లి జరి పించి సాగనంపాల్సిన తండ్రి కానరాని లోకాల కు వెళ్లడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై అశోక్‌ తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top