రైతు ఆత్మహత్య | farmer committed to suicide in kurnool district | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్య

Jul 9 2017 1:16 PM | Updated on Oct 1 2018 2:47 PM

అప్పుల బాధ తాళలేక ఓ మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

కర్నూలు: అప్పుల బాధ తాళలేక ఓ మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటుహాలు గ్రామానికి చెందిన సుధాకర్‌(35) తనకున్న మూడెకరాలతో పాటు మరో మూడున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిర్చిపంట సాగు చేశాడు. వచ్చిన పంటను సోలాపూర్‌కు చెందిన వ్యాపారులకు విక్రయించాడు.

కాగా.. వ్యాపారులు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో.. తెచ్చిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ మధ్య కాలంలో అప్పుల వారి బాధలు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement