శోభాయమానం... తెప్పోత్సవం | Fanfare ... Float | Sakshi
Sakshi News home page

శోభాయమానం... తెప్పోత్సవం

Mar 15 2017 11:20 PM | Updated on Sep 5 2017 6:10 AM

శోభాయమానం... తెప్పోత్సవం

శోభాయమానం... తెప్పోత్సవం

భూదేవి, లక్ష్మీ సమేతుడైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం బుధవారం దిగువ అహోబిలంలోని కోనేరులో వైభవంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామి, అమ్మవారు సేద తీరేందుకు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ.

ఆళ్లగడ్డ: భూదేవి, లక్ష్మీ సమేతుడైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం బుధవారం దిగువ అహోబిలంలోని కోనేరులో వైభవంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామి, అమ్మవారు సేద తీరేందుకు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో కోనేటి వరకు తీసుకొచ్చారు. తెప్పలో స్వామివార్లను అధిష్టింపజేసి  పీఠాధిపతి శ్రీరంగనా«థ యతీంత్ర మహాదేశికన్, ఆలయ అర్చకులు,  వేదపండితల పూజలు నినర్వహించారు. సుమారు గంటపాటు ఉత్సవం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement