విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు | Essay, debates for students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

Dec 17 2016 11:38 PM | Updated on Jun 1 2018 8:39 PM

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 7, 8, 9 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ ఓ ప్రకనటలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్ : జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 7, 8, 9 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ ఓ ప్రకనటలో తెలిపారు. ’వినియోగదారు వివాదాల సత్వర నిర్ధారణ కోసం ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం’ అనే అంశంపై 19న పాఠశాలస్థాయి, 20న మండలస్థాయి, 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో పోటీలు ఉంటాయని వివరించారు. జిల్లాస్థాయి విజేతలకు 23న విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement