ఉపాధిహామీ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి | Employment guarantee to pay the bills | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Jul 28 2016 12:48 AM | Updated on Sep 4 2017 6:35 AM

: మండలంలోని బస్వాపురం గ్రామ ఉపాధిహామీ కూలీలకు తొమ్మది నెలల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని, నిర్లక్ష్యం చేసిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ను తొలగించాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు.

భువనగిరి అర్బన్‌ : మండలంలోని బస్వాపురం గ్రామ ఉపాధిహామీ కూలీలకు తొమ్మది నెలల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని, నిర్లక్ష్యం చేసిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ను తొలగించాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధిహామీ కూలీలు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. బిల్లులు చెల్లించకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వరకు బిల్లులు చెల్లిస్తామని ఎంపీడీఓ గోపాలకిషన్‌రావు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాసాల వెంకటేశ్, కాంగ్రెస్‌ నాయకులు పీసీసీ నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి ఏశాల అశోక్, యువజన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి చిక్కుల వెంకటేశం, దయ్యాల నర్సింహ, ఉడుత రాఘవులు, ముదిగొండ రాములు, జమయ్య, చంద్రమ్మ, అండమ్మ, అంజమ్మ, పద్మ, మంగమ్మ, కోటయ్య, చిక్కుల పాండు, నరాల రమేశ్, రాజు, చందు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement