మీ గెలుపే.. బహుమతి | election compaign in khammam | Sakshi
Sakshi News home page

మీ గెలుపే.. బహుమతి

Feb 25 2016 3:32 AM | Updated on Mar 22 2019 6:25 PM

మీ గెలుపే.. బహుమతి - Sakshi

మీ గెలుపే.. బహుమతి

‘కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు అలుపెరుగకుండా కష్టపడండి.. మీరు పోటీ చేసిన డివిజన్‌లో గెలిచి..

నిరంతరం అందుబాటులో ఉంటా..
పార్టీ గుర్తును ప్రజలకు తెలపాలి..
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం : ‘కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు అలుపెరుగకుండా కష్టపడండి.. మీరు పోటీ చేసిన డివిజన్‌లో గెలిచి.. వైఎస్సార్ సీపీ సత్తా చాటితే అదే నాకు మీరిచ్చే బహుమతి’ అని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని  వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో పార్టీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులతో బుధవారం రాత్రి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పార్టీ గుర్తును ఓటర్లకు తెలియజేయాలన్నారు. స్క్రూట్నీ పూర్తయిన తర్వాత ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరి తరఫున ప్రచారం చేస్తానని.. ఇతర అభ్యర్థులు, పార్టీలు, నాయకులు, అధికారుల నుంచి ఏఒక్క అభ్యర్థికి, కార్యకర్తకు ఏచిన్న సమస్య తలెత్తినా.. ఇబ్బంది కలిగినా.. వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

వెనుకడుగు వేయకుండా సమస్యను పరిష్కరిస్తానన్నారు. బెదిరింపులకు పాల్పడే వారికి భయపడవద్దని, ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవారైనా నేనున్నానని దైర్యం చెప్పారు. మీ విజయం కోసం మారుమూల ప్రాంతానికైనా వస్తానని.. ఎన్ని కిలోమీటర్లయినా నడుస్తానని.. ఎంత కష్టపడటానికైనా తాను సిద్ధమని చెప్పారు. అధికార పార్టీ నాయకుల్లా సాధ్యపడని హామీలు గుప్పించి మోసగించే ప్రయత్నం చేస్తే రాజకీయంగా ఎదగలేరని ఆయన సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలాసంపత్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సూతగాని జైపాల్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి సాధు రమేష్‌రెడ్డి, వైరా నియోజకవర్గ కోఆర్డినేటర్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement