'బీఫ్, ఫోర్క్ ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి' | eat beef, pork at home dont Politisise: Mehmood Ali | Sakshi
Sakshi News home page

'బీఫ్, ఫోర్క్ ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి'

Dec 2 2015 8:35 PM | Updated on Sep 3 2017 1:23 PM

'బీఫ్, ఫోర్క్ ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి'

'బీఫ్, ఫోర్క్ ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి'

బీఫ్, ఫోర్క్ ఏమైనా తినండి కానీ, ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.

హైదరాబాద్: బీఫ్, ఫోర్క్ ఏమైనా తినండి కానీ, ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నది చదువుకునేందుకని తెలిపారు. యూనివర్సిటీలో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
మరో వైపు ఓయూ క్యాంపస్లో బీఫ్ ఫెస్టివల్, గోపూజలకు అనుమతి లేదని ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన 'బీఫ్ ఫెస్టివల్' తల పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని కొన్ని వర్గాలు చెబుతుండగా... ఎలాగైనా అడ్డుకుని తీరుతామని మరో వర్గంవారు స్పష్టం చేస్తున్నారు. ఇందుకుగాను ఎవరికివారు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement