రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు | Driver injured in lorry accident | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు

Aug 5 2016 8:40 AM | Updated on Sep 29 2018 5:29 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి సమీపంలో శుక్రవారం రెండు లారీలు ఢీకొన్నాయి.

గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి సమీపంలో శుక్రవారం రెండు లారీలు ఢీకొన్నాయి.  ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.... కృష్ణా పుష్కరాల సమీపిస్తున్న నేపథ్యంలో రహదారి పనులు ఊపందుకున్నాయి. ఆ క్రమంలో రహదారి నిర్మాణం కోసం కాంక్రీట్ మిక్చర్ లోడ్తో అధిక వేగంతో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో కాంక్రీట్ లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు గుంటూరుకు చెందిన భాస్కరరావు అని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement