‘డబుల్‌బెడ్‌రూం’ నిర్మాణాలు వేగవంతం చేయాలి | double bedroom build fast | Sakshi
Sakshi News home page

‘డబుల్‌బెడ్‌రూం’ నిర్మాణాలు వేగవంతం చేయాలి

Aug 4 2016 11:22 PM | Updated on Sep 29 2018 4:44 PM

చిగురుమామిడి : డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్‌ సూచించారు. మండలంలోని చిన్నముల్కనూర్‌ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా వర్కర్లను నియమించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

  • ఆర్డీవో చంద్రశేఖర్‌
  • చిగురుమామిడి : డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్‌ సూచించారు. మండలంలోని చిన్నముల్కనూర్‌ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా వర్కర్లను నియమించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం మండలంలోని ఇందుర్తిలో నిర్వహిస్తున్న ఆర్‌ఓఆర్‌ మోటేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను పరిశీలించి తక్షణమే అమలు చేయాలని తహసీల్దార్‌ రాజాగౌడ్‌కు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అక్బర్, ఉపసర్పంచ్‌ చింతపూల నరేందర్, వార్డు సభ్యుడు బందెల శ్రీనివాస్, తదితరులున్నారు. కాగా ఇందుర్తి జెడ్పీ పాఠశాలలో కొన్నేళ్లుగా ఒకటే గ్రూపు వంట చేస్తుందని, వారిని తక్షణమే తొలగించాలని కొందరు మహిళలు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement