Sakshi News home page

తాగారు.. దొరికిపోయారు

Published Sat, Jul 2 2016 8:46 AM

doctors fine on drunk and drive case

డాక్టర్స్ డే రోజున ముగ్గురు డాక్టర్లపై  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు - కోర్టు వినూత్న శిక్ష
రూ.2వేల చొప్పున జరిమానా, నిర్మల హృదయ్ భవన్‌లో రెండు రోజుల వైద్యసేవ
 
విజయవాడ: డాక్టర్స్ డే రోజున ముగ్గురు డాక్టర్లకు కోర్టు వినూత్న శిక్ష విధించింది. మద్యం సేవించి కారు నడిపిన సదరు డాక్టర్లకు ఒక్కొక్కరికి రు.2వేల జరిమానా విధిస్తూ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జేవీవీ సత్యనారాయణమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.

అంతేకాదు.. ముగ్గురు డాక్టర్లూ.. రెండు రోజుల పాటు (శని, ఆదివారాల్లో) నగరంలోని నిర్మల హృదయ్ భవన్‌లోని వృద్ధులకు వైద్యం అందించాలని ఆదేశించింది. ఓ ప్రముఖ ఆస్పత్రి చైర్మన్, మరో రెండు ప్రముఖ ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు మద్యం సేవించి కారు నడుపుతుండగా, నాల్గో ట్రాఫిక్ పోలీసులు గురు, శుక్రవారాల్లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి పైవిధంగా వారికి జరిమానా విధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement