పదేళ్లకాలంలో ప్రజలకు ఏం చేశారు? | DK Aruna w/s Mla Ala | Sakshi
Sakshi News home page

పదేళ్లకాలంలో ప్రజలకు ఏం చేశారు?

Aug 4 2016 12:11 AM | Updated on Sep 28 2018 7:36 PM

మాట్లాడుతున్న ఆల వెంకటేశ్వర్‌రెడ్డి - Sakshi

మాట్లాడుతున్న ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

చిన్నచింతకుంట : పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏం చేసిందో.. మంత్రి డీకే అరుణ చెప్పాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

చిన్నచింతకుంట : పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏం చేసిందో.. మంత్రి డీకే అరుణ చెప్పాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ముచ్చింతల గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సత్యమ్మ ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీనుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆల మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కట్టి కరువును తరిమేయాలని చూస్తుంటే భూ సేకరణకు అడ్డుపడుతూ రైతులను రెచ్చగొట్టడం మంచిపద్ధతి కాదన్నారు. కోయిల్‌సాగర్‌ రెండవ మోటర్‌ రిపేరు ఉన్నందున్న కొంత ఆలస్యం జరిగిందని, వెంటనే సరిచేయించి ఊకచెట్టు వాగుకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. అనంతరం యాదవ కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో సూదిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, క్రాంతిఆంజనేయులు, సులోచన, రాము, విష్ణుగౌడ్, జనార్దన్, సురేందర్‌రెడ్డి, నాగేష్, మల్లెష్, మల్లెల బాలరాజు, అశోక్‌రెడ్డి, తిమ్మారెడ్డి  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement