జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం | district level games starts | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం

Nov 16 2016 12:31 AM | Updated on Sep 4 2017 8:10 PM

అంతర్జాతీయ విభిన్న ప్రతిభ వంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఔట్‌డోర్‌ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు.

కర్నూలు (టౌన్‌):  అంతర్జాతీయ విభిన్న ప్రతిభ వంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఔట్‌డోర్‌ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి  అతిథులుగా డీఆర్‌డీఏ పీడీ రామక​ృష్ణ, వయోజన విద్య డిప్యూటీ డైరక్టర్, వికలాంగుల సంక్షేమ శాఖ అడిషనల్‌ డైరక్టర్‌ భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ మాట్లాడుతూ ఈ ఆటల పోటీలలో మొదటి స్థానం గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వారు శారీరక విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకి ల్‌ పోటీలను జెండాఊపి ప్రారంభించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement