ఒకప్పుడు పిల్లలు ఆరుబయట గిల్లీదండా, బొంగరాలు, గోలీలు వంటి ఆటలాడుతూ కనిపించేవారు. ఇప్పుడు గల్లీల్లో క్రికెట్ తప్ప వేరే ఆటలాడే పిల్లలు కనిపించడం బాగా అరుదుగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక పిల్లల ఆటల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. స్మార్ట్‌ఫోన్ పిల్లలకు క్రీడావేదికగా మారిపోయింది. మన దేశ జనాభాలో పంతొమ్మిదేళ్ల లోపు పిల్లలు దాదాపు 40% వరకు ఉంటారు. స్మార్ట్‌ఫోన్‌లలో పిల్లలు ఇష్టంగా ఆడుకుంటున్న ఆటల గురించి గణాంకాలు...
పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లలో ఆడే ఆటలు గేమింగ్ పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో మన దేశంలో స్మార్ట్‌ఫోన్‌లో ఆటలాడే పిల్లల సంఖ్యతో పాటు గేమింగ్ ఇండస్ట్రీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ పెరుగుదల ఏ స్థాయిలో ఉందో గణాంకాల్లో చూద్దాం

దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం అందుబాటులోకి వచ్చిన కొత్తలో పిల్లలు వీటిలోని ఆటలతో వారానికి మూడు నాలుగు గంటల వరకు మాత్రమే గడిపేవారు.
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల వాడకం మరింత పెరగడమే కాకుండా, వీటిలో గేమ్స్‌తో పిల్లలు గడిపే సమయం గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం మన దేశంలోని పిల్లలు వారానికి సగటున 14 గంటల వరకు మొబైల్‌గేమ్స్‌తో గడుపుతున్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. మొబైల్ గేమ్స్‌లో పిల్లలు గడిపే సమయం పెరుగుతూ వస్తోందనేందుకు పై గణాంకాలే నిదర్శనం.


