played in
-
ఈ తరం పిల్లల ఆటలు
ఒకప్పుడు పిల్లలు ఆరుబయట గిల్లీదండా, బొంగరాలు, గోలీలు వంటి ఆటలాడుతూ కనిపించేవారు. ఇప్పుడు గల్లీల్లో క్రికెట్ తప్ప వేరే ఆటలాడే పిల్లలు కనిపించడం బాగా అరుదుగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక పిల్లల ఆటల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. స్మార్ట్‌ఫోన్ పిల్లలకు క్రీడావేదికగా మారిపోయింది. మన దేశ జనాభాలో పంతొమ్మిదేళ్ల లోపు పిల్లలు దాదాపు 40% వరకు ఉంటారు. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఇష్టంగా ఆడుకుంటున్న ఆటల గురించి గణాంకాలు...పిల్లలు స్మార్ట్ఫోన్లలో ఆడే ఆటలు గేమింగ్ పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో మన దేశంలో స్మార్ట్‌ఫోన్‌లో ఆటలాడే పిల్లల సంఖ్యతో పాటు గేమింగ్ ఇండస్ట్రీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ పెరుగుదల ఏ స్థాయిలో ఉందో గణాంకాల్లో చూద్దాందేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం అందుబాటులోకి వచ్చిన కొత్తలో పిల్లలు వీటిలోని ఆటలతో వారానికి మూడు నాలుగు గంటల వరకు మాత్రమే గడిపేవారు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల వాడకం మరింత పెరగడమే కాకుండా, వీటిలో గేమ్స్‌తో పిల్లలు గడిపే సమయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మన దేశంలోని పిల్లలు వారానికి సగటున 14 గంటల వరకు మొబైల్గేమ్స్తో గడుపుతున్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. మొబైల్ గేమ్స్‌లో పిల్లలు గడిపే సమయం పెరుగుతూ వస్తోందనేందుకు పై గణాంకాలే నిదర్శనం. -
బతుకమ్మ ఆడిన మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ (ఫొటోలు)
-
శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కాదు.. కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: వివాహాది శుభకార్యాలలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. శుభకార్యాలలో మూవీ సాంగ్స్ ప్లే చేయడంపై రాయాల్టీ వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐటీ) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల ప్రదర్శనకు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపిన డీపీఐటీ .. ఇది కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, ఏదైనా సౌండ్ రికార్డింగ్‌లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని అధికారులు స్పష్టం చేశారు. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని డీపీఐటీ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్ సంస్థలు వీటికి దూరంగా ఉండాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. ఏదైనా సంస్థల నుంచి రియాల్టీకి సంబంధించిన డిమాండ్లు వస్తే వాటిని అంగీకరించవద్దని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు... -
కోళ్లఫారంలో పేకాట.. 21.77 లక్షలు స్వాధీనం
పోలీసుల దాడి.. 32 మంది అరెస్టు టి.నరసాపురం : పశ్చిమగోదావరి జిల్లా బండివారిగూడెంలో ఓ రైతుకు చెందిన కోళ్లఫారంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి టి.నరసాపురం పోలీసులు దాడి చేశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ముగ్గురు, ఆంధ్రాలోని కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, తాడేపల్లిగూడేలకు చెందిన 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.21,77,095 స్వాధీనం చేసుకున్నారు. టి.నరసాపురం ఎస్సై కె.నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వారి సూచనల మేరకు చింతలపూడి ఎస్ఐ సైదానాయక్, జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్ఐ ఎ.ఆనందరెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. టి.నరసాపురం పోలీసులకు సహకరించారు. పెద్దఎత్తున జరుగుతున్న పేకాట శిబిరం గుట్టురట్టు చేసినందుకు టి.నరసాపురం ఎస్సై కె.నాగేంద్రప్రసాద్‌ను, సిబ్బందిని ఎస్పీ భాస్కర్‌భూషణ్ అభినందించారు. ఈ జూదరులంతా జిల్లాలో రోజుకొక ప్రదేశాన్ని ఎంచుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఆదివారం టి.నరసాపురం మండలం బండివారిగూడెంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసినట్టు ఎస్సై కె.నాగేంద్రప్రసాద్ తెలిపారు.


