కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామ పరిధిలోని జిల్లా జైలును మంగళవారం జైళ్ల శాఖ ఐజీ బి.సునిల్‌కుమార్ తనిఖీ చేశారు.
జిల్లా జైలును తనిఖీ చేసిన జైళ్ల శాఖ ఐజీ
Mar 15 2017 12:32 AM | Updated on Sep 5 2017 6:04 AM
కర్నూలు(లీగల్) : కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామ పరిధిలోని జిల్లా జైలును మంగళవారం జైళ్ల శాఖ ఐజీ బి.సునిల్‌కుమార్ తనిఖీ చేశారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేస్తున్న సిమెంటు ఇటుకల తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల వసతులు, ఆహారంపై ఆరా తీశారు. జైలు రికార్డులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా జైళ్ల అధికారి వరుణారెడ్డి, జైలర్లు వీరేంద్రప్రసాద్, నరసింహారెడ్డి, సబ్ జైలర్ సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళల జైలును సందర్శించి అక్కడి సౌకర్యాలను ఆరా తీశారు.
Advertisement


