బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల! | UAE President orders release of 956 prisoners ahead of Eid Al Adha 2026 | Sakshi
Sakshi News home page

UAE: బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!

May 21 2026 1:30 AM | Updated on May 21 2026 1:31 AM

UAE President orders release of 956 prisoners ahead of Eid Al Adha 2026

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైళ్లుల‌లో మగ్గుతున్న 956 మంది ఖైదీలను విడుదల చేయాలని నహ్యాన్ ఆదేశించారు.

సమాజంలో క్షమాగుణాన్ని,సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వివిద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ జరిమానాలు లేదా ఆర్థికపరమైన బకాయిలు చెల్లించలేక జైళ్లలోనే ఉంటున్న‌ ఖైదీల అప్పుల మొత్తాన్ని యూఏఈ అధ్యక్షుడే స్వయంగా చెల్లించనున్నారు. 

దీంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఖైదీలు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. మరోవైపు అజ్మాన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్-నుఐమి కూడా తన పరిధిలోని జైళ్ల నుండి 230 మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

 షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి సైతం 227 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో మొత్తం 1400కు పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా ప్రతీ ఏడాది రంజాన్‌,  రంజాన్, బక్రీద్, జాతీయ దినోత్సవాల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఒక ఆనవాయితీగా వస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement