Sheikh Mohamed Bin Zayed
-
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైళ్లులలో మగ్గుతున్న 956 మంది ఖైదీలను విడుదల చేయాలని నహ్యాన్ ఆదేశించారు.సమాజంలో క్షమాగుణాన్ని,సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వివిద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ జరిమానాలు లేదా ఆర్థికపరమైన బకాయిలు చెల్లించలేక జైళ్లలోనే ఉంటున్న ఖైదీల అప్పుల మొత్తాన్ని యూఏఈ అధ్యక్షుడే స్వయంగా చెల్లించనున్నారు. దీంతో బయటకు వచ్చిన ఖైదీలు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు అజ్మాన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్-నుఐమి కూడా తన పరిధిలోని జైళ్ల నుండి 230 మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి సైతం 227 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో మొత్తం 1400కు పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా ప్రతీ ఏడాది రంజాన్, రంజాన్, బక్రీద్, జాతీయ దినోత్సవాల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఒక ఆనవాయితీగా వస్తోంది. -
యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేల భారత ప్రధాని నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత వాణిజ్య నౌకాయానంపై ఇద్దరు నాయకులు చర్చించారు.మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్న ప్రకారం.. నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడాను. అతనికి ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరం చర్చించాం. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నావిగేషన్ అవసరమని మేము అంగీకరించాము. యూఏఈపై జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. పశ్చిమాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం కలిసి పని చేస్తాము.కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఇది రెండోసారి. మార్చి 2న కూడా మోదీ యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడి దాడులను ఖండించారు. మోదీ ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ అల్-ఖాలెద్ అల్-సబాహ్, ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో కూడా మాట్లాడారు. -
యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు కొత్త అధ్యక్షుడిగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని శనివారం అక్కడి మీడియా అధికారికంగా ప్రకటించింది. అనారోగ్య సమస్యలతో యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ఇప్పుడు అధికారికంగా యూఏఈ అధ్యక్షుడిగా ప్రకటించారు. షేక్ ఖలీఫా పదవిలో ఉన్నప్పటికీ ఆయన అనారోగ్యం కారణంగా.. చాలా ఏళ్ల నుంచి షేక్ మొహమ్మద్ బిన్నే పాలన వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. షేక్ ఖలీఫా మరణంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. షేక్ మొహమ్మద్‌ను ఎంబీజీగా వ్యవహరిస్తుంటారు. అధ్యక్ష ప్రకటన నేపథ్యంలో.. UAE యొక్క ఏడు ఎమిరేట్స్ పాలకులతో కూడిన ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సభ్యులను కలుసుకున్నారాయన. ఎన్నో మార్పులు.. ఎడారి సంప్రదాయ దేశం యూఏఈ గడ్డ మీద ఎన్నో సంస్కరణలకు తాత్కాలిక అధ్యక్షుడి హోదాలోనే షేక్ మొహమ్మద్ కారణం అయ్యారు. అంతరిక్షంలోకి యూఏఈ పౌరుడ్ని పంపడం, మార్స్ పరిశోధనలో భాగం కావడం, మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్‌ను ప్రారంభించడం, విదేశాంగ విధానాలను మెరుగు పర్చడం లాంటి ఎన్నో పనులు చేశారు. అమెరికా జోక్యాన్ని తగ్గించడం, ఇజ్రాయెల్‌తో సంబంధాలు, యెమెన్ యుద్ధంలో పాల్గొనడం లాంటి కీలక పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి కూడా. చదవండి👉🏼: యూఏఈ అధ్యక్షుడి కన్నుమూత!


