జిల్లాస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం | dist chess compititions started | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

Aug 8 2016 12:09 AM | Updated on Sep 4 2017 8:17 AM

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభం

స్థానిక న్యూస్‌ హైస్కూల్‌లో ఆదివారం జిల్లా స్థాయి యూత్‌ చెస్‌ పోటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి ప్రారంభించారు.

నల్లగొండ టూటౌన్‌ : స్థానిక న్యూస్‌ హైస్కూల్‌లో ఆదివారం  జిల్లా స్థాయి యూత్‌ చెస్‌ పోటీలను  టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి  ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ  చెస్‌ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆటలు ఆడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను ఈ నెల 12, 13వ తేదీలలో మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె. కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, కౌన్సిలర్‌ అవుట రవీదంర్, న్యూస్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ గంట్ల అనంతరెడ్డి, ట్రస్మా రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, చెస్‌ ప్రతినిధులు మేడ విశ్వప్రసాద్, ఇబ్రహీం, పి.డి. కుమార్, ఎ. తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement