breaking news
compititions
-
‘నీళ్ల’పై తడాఖా.. జోరుగా ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు
సాక్షి, ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన గాయత్రి జలపాతం వద్ద శనివారం ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు నిర్వహించారు. అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు వివిధ దేశాల నుంచి 20 మంది యువతీ, యువకులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం విదేశీ యువతితోపాటు ఇద్దరు యువకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 30 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం విదేశీ యువతతోపాటు మరో 30 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. రెండు ఎత్తైన భారీ కొండల మధ్య నుంచి వస్తున్న గాయత్రి జలపాతం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గాయత్రి జలపాతం వద్ద ప్రపంచ రాపెల్లింగ్ పోటీలు -
జిల్లాస్థాయి చెస్ పోటీలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : స్థానిక న్యూస్ హైస్కూల్లో ఆదివారం జిల్లా స్థాయి యూత్ చెస్ పోటీలను టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆటలు ఆడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను ఈ నెల 12, 13వ తేదీలలో మిర్యాలగూడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె. కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, కౌన్సిలర్ అవుట రవీదంర్, న్యూస్ స్కూల్ కరస్పాండెంట్ గంట్ల అనంతరెడ్డి, ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, చెస్ ప్రతినిధులు మేడ విశ్వప్రసాద్, ఇబ్రహీం, పి.డి. కుమార్, ఎ. తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.