క్రికెట్‌ మ్యాచ్‌లకు అంతరాయం | Disruption of cricket matches | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ మ్యాచ్‌లకు అంతరాయం

Jul 29 2016 7:58 PM | Updated on Sep 4 2017 6:57 AM

క్రికెట్‌ మ్యాచ్‌లకు అంతరాయం

క్రికెట్‌ మ్యాచ్‌లకు అంతరాయం

కడప నగరంలో నిర్వహిస్తున్న అండర్‌–19 ఎలైట్‌ గ్రూపు క్రికెట్‌ పోటీలకు వర్షం అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌లను మధ్యాహ్నం తర్వాత ప్రారంబించారు.

కడప స్పోర్ట్స్‌ :

కడప నగరంలో నిర్వహిస్తున్న అండర్‌–19 ఎలైట్‌ గ్రూపు క్రికెట్‌ పోటీలకు వర్షం అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌లను మధ్యాహ్నం తర్వాత ప్రారంబించారు. కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో సాయంత్రం 4.05 నిమిషాలకు
మ్యాచ్‌ ప్రారంభమైంది. 92 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు 36 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. జట్టులోని నోవా 39, ప్రణీత్‌ 29 పరుగులు చేయగా మహీప్‌ 72 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. అనంతపురం బౌలర్లు గిరినాథ్, ముదాసిర్, సాంబశివా తలా ఒక వికెట్‌ తీశారు. దీంతో మూడోరోజు మ్యాచ్‌ ముగిసింది.
కొనసాగుతున్నకడప బ్యాటింగ్‌..
కేఓఆర్‌ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కడప–విశాఖ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. 20 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన కడప జట్టు 63 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. జట్టులోని నూర్‌బాషా 52 పరుగులు చేశాడు. విశాఖ బౌలర్లు వంశీ 3, ప్రశాంత్‌ 1 వికెట్‌ తీశారు. దీంతో మూడోరోజు ఆట ముగిసింది. కాగా వర్షం తగ్గుముఖం పడితే శనివారం మ్యాచ్‌ నిర్వహించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement