కాలేజీకి వెళ్లిన విద్యార్థి అదృశ్యం | disappearance of college student | Sakshi
Sakshi News home page

కాలేజీకి వెళ్లిన విద్యార్థి అదృశ్యం

Aug 9 2016 7:13 PM | Updated on Sep 4 2018 5:21 PM

కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ యువకుడు కనిపించకుండా పోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ యువకుడు కనిపించకుండా పోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన సాయి ఈశ్వర్‌తేజ్ (19) బిటెక్ చదువుతున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కాలేజీకి వెళ్తున్నానని తెలిపి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో చూట్టుపక్కల ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకాబు చేసిన ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement