నూతన పెన్షన్‌ విధానం రద్దుకు డిమాండ్‌ | demand to cancel to new pension system | Sakshi
Sakshi News home page

నూతన పెన్షన్‌ విధానం రద్దుకు డిమాండ్‌

Oct 26 2016 11:39 PM | Updated on Sep 4 2017 6:23 PM

ఏలూరు అర్బన్‌ : నూతన పెన్షన్‌ విధానంతో ఉపాధ్యాయులకు రక్షణ కరువైందని, దీనిని వెంటనే రద్దుచేయాలని ఏపీ పీఆర్టీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక కలెక్టరేట్‌ ఎదుట బుధవారం జిల్లాస్థాయి ధర్నా నిర్వహించారు.

ఏలూరు అర్బన్‌ : నూతన పెన్షన్‌ విధానంతో ఉపాధ్యాయులకు రక్షణ కరువైందని, దీనిని వెంటనే రద్దుచేయాలని ఏపీ పీఆర్టీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక కలెక్టరేట్‌ ఎదుట బుధవారం జిల్లాస్థాయి ధర్నా నిర్వహించారు. జిల్లా యూనియన్‌  గౌరవాధ్యక్షుడు ఏవీ కాంతారావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ.. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. జిల్లా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు మాట్లాడుతూ.. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, టీచర్లకు  ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు.  రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.రాధ మాట్లాడుతూ.. అంతర్గత మూల్యాంకనంలో మార్పులు తీసుకోవాలని కోరారు. జేఏసీ నాయకులు హరినాథ్, శ్రీనివాస్, శ్రీధర్‌రాజు సంఘీభావం తెలిపారు.  పీఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు పి.బాబ్జీ, డి.దావీదు, బి.రాము, బి.త్రినాథ్‌ పాల్గొన్నారు. అనంతరం జేసీ పి.కోటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement