డెంగీ లక్షణాలతో యువకుడి మృతి | Death of a young man with dengue symptoms | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలతో యువకుడి మృతి

Sep 18 2017 10:52 PM | Updated on Sep 19 2017 4:44 PM

డెంగీ లక్షణాలతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... రామగిరి మండల కేంద్రంలోని కొత్తగేరికి చెందిన లక్ష్మన్న కుమారుడు పవన్‌కుమార్‌ (29) కొంత కాలంగా పుట్టపర్తిలోని స్టేట్‌బ్యాంకు ఎదురుగా ఉన్న జియో సెల్‌షాపులో పని చేస్తున్నాడు.

పుట్టపర్తి అర్బన్‌: డెంగీ లక్షణాలతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... రామగిరి మండల కేంద్రంలోని కొత్తగేరికి చెందిన లక్ష్మన్న కుమారుడు పవన్‌కుమార్‌ (29) కొంత కాలంగా పుట్టపర్తిలోని స్టేట్‌బ్యాంకు ఎదురుగా ఉన్న జియో సెల్‌షాపులో పని చేస్తున్నాడు. పవన్‌కుమార్‌ సమీపంలోని ఒ గదిలో అద్దెకుంటున్నాడు. గత సోమవారం తీవ్ర జ్వరం రావడంతో సత్యసాయి ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స పొందాడు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మెడికేర్‌ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement